ఆరెకరాల్లో ఆరవై రకాలు

60 varieties in 6 acres

ఆరెకరాల్లో ఆరవై రకాలు

ఈ రైతు మాట్లాడుతుంటే సుభాష్‌ పాలేకర్‌ మన పక్కనే ఉన్నట్టుంటుంది.
కుందూరు వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా గోదారి తీర ప్రాంతం నుండి ప్రకాశం జిల్లా, తిప్పాయి పాలెంకు వలస వచ్చాడు. దక్షిణపు వైపునున్న కొండకింద గడ్డి కూడా మొలవని పదెకరాల రాళ్ల నేలలో సాగు మొదలు పెట్టి, ముందుగా ఎకరం విస్తీర్ణంలో పంటకుంటను తవ్వి కొండమీద పడిన వాన నీటిని దానిలోకి మళ్లించాడు.

vekatreddy-with-Vermicompost

vekatreddy-with-Vermicompost

నాలుగు పశువులను పెంచి వాటి వ్యర్ధాలను పొలం అంతటా చల్లగా, ఆ వాసనకు భూమి లోని ఎరలు పైకి వచ్చి ఆ రైతుకు సహజ ఎరువును ప్రసాదించాయి. తన జీవితాన్ని మార్చిన వర్మి కాంపోస్ట్‌న్ ని తీసి చూపిస్తూ ఎరలు లేకపోతే రైతుకు బతుకు తెరువు లేదన్నాడు.
సీన్‌ కట్‌ చేస్తే…
ఆరెకరాల్లో ఆరవై రకాల మొక్కలు పెంచుతూ మాలాంటి వాళ్లకు సూర్యోదయానికి ముందే టైం ఇచ్చి, పొలంలోకి అడుగేస్తాడు. జిగురు లేని పనస,గింజలేని పనస, ఖర్జూర, యాపిల్‌ లాంటి అరుదైన చెట్లు కూడా ఈ కరవు నేలలో చిగురిస్తున్నాయి.  ( వెంకటరెడ్డి contact no-9908362266)

(ఏపీ గ్రామీణాభివృద్ది శాఖ కోసం రూరల్‌ మీడియా రిపోర్ట్‌ చేసిన కాఫీటేబుల్‌ బుక్‌ నుండి)

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *