భూమి రికార్డ్‌లు జాగ్రత్త

25 Schedule Caste families received land records kits

భూమి రికార్డ్‌లు జాగ్రత్త

1. ఇంటిoటికీ వెళ్ళి భూమి వివరాలు, భూమి సమస్యల వివరాల సేకరణ
2. ప్రతి భూ కమతం వద్దకు వెళ్ళి వివరాల సేకరణ మాదిరి పటం (rough sketch ) రూపొందించటం.
3. పహణి, 1B, సేత్వర్, ఖస్రా పహణి నుంచి వివరాల సేకరణ.
4. పైన సేకరించిన వివరాల ద్వారా భూమి సమస్యల గుర్తింపు
5. సంబoదిత అధికారులకు నిర్దేశిత పద్ధతిలో సమస్యల నివేదన
6. గ్రామా సభలు, రెవిన్యూ కోర్టులు, గ్రామా రెవిన్యూ కోర్టులు ద్వారా ఈ పద్దతిలో ఈ 6 గ్రామాలలో దాదాపు 4 వేల భూమి సమస్యలను గుర్తించాము. ఈ 6 గ్రామాల పహణి, 1B, లలో దాదాపు 11 వేల entry లు సరిచేయవల్సినవిగా గుర్తించాము.

25 Schedule Caste families received land records kits

25 Schedule Caste families received land records kits

ఈ సమస్యలను రెవిన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకవెళ్ళాము. రెవిన్యూ అధికారులు ఈ గ్రామాలలోని సమస్యలను పరిష్కరించి రికార్డులను సవరిస్తున్నారు. ఇప్పటి వరకు, మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పుట్టలభూపతి గ్రామంలో ( గిరిజన గ్రామం ) రికార్డులను సవరించి 73 మంది గిరిజనులకు పట్టా లతో కూడిన భూమి రికార్డుల కిట్ ను అందజేశాము. అలాగే, నేడు తోరుర్ర్ మండలం లోని గోపాలగిరి గ్రామంలో భూసమస్యలు పరిష్కరించి, రికార్డులను సరి చేసి 25 మంది దళితులకు భూమి రికార్డుల కిట్ ను అందజేశాము. ఈ 6 గ్రామాలలో జరిగిన కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అభినందిoచాయి.
స్వాధీనంలో భూమి,రికార్డుల్లో పేరు, చేతిలో పట్టా ఉంటేనే భూమిపై హక్కుకి పూర్తి భద్రత. ఈ మూడు ఉంటేనే బ్యాంకులనుంచి రుణం, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పంట భీమా మొదలగునవి పొందడం సాధ్యం. తెలంగాణా రాష్ట్రంలోని ప్రతి పల్లెలో భూమి ఉండి ఈ మూడింటిలో ఏదో ఒకటి లేని వారే ఎక్కువ శాతం ఉంటారు. సృష్టమైన, భద్రమైన భూమి హక్కులను కల్పించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నాయి. వేల కోట్ల రూపాయల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఇటివల DILRMP ని చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం భూమి రికార్డుల ఆధునీకరణ ప్రారంబించడంతో పాటు భూముల రీసర్వే చేయాలనీ నిర్ణయం తీసుకుంది.

భూమి రికార్డుల ఆధునీకరణ జరిగి భూమి ఉన్న ప్రతి వారికీ సృష్టమైన భద్రమైన భూమి హక్కులు చేకురాలంటే ప్రజల భాగస్వామ్యంతో కూడిన భూమి రికార్డుల సవరణ కార్యక్రమం చేపడితేనే సాధ్యమవుతుంది. భూమి ఉన్న ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో కీలక భూమిక వహిస్తేనే పలితాలు ఆశించిన మేరకు ఉంటాయి.

అందుకే , నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం, ల్యాoడేసా (RDI) సంస్థలు సంయుక్తంగా మహబూబాబాద్ & జనగాం జిల్లాలలోని 6 గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో కూడిన రికార్డుల సవరణ, భూ సమస్యల పరిష్కార కార్యక్రమం చేపట్టాయి. ఎంపిక చేసిన 6 గ్రామాలలో ప్రతి గ్రామం నుంచి 3 యువతీ యువకులను ఎంపిక చేసి భూమి రికార్డులపై శిక్షణ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతట చేపట్టితే గ్రామానికి 75 వేల నుంచి లక్ష రూపాయల ఖర్చుతో 4-6 నెలల సమయంలో రికార్డులను సరిచేసి ప్రతి రైతుకు పట్టాలతో కూడిన భూమి రికార్డుల కిట్ అందచేయవచ్చు. ఆతి తక్కువ ఖర్చు తో, తక్కువ కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రికార్డుల ఆధునీకరణ లక్ష్యలను ఈ నమూనా ద్వారా సాధించవచ్చు. ప్రతి గ్రామంలో కొన్ని వందలమంది పేద, గిరిజన, దళిత రైతులకు వారి భూమిపై భద్రమైన భూమి హక్కులతో కూడిన పట్టాలు అందచేయవచ్చు.

  • లాండేశా డైరెక్టర్ సునీల్ కుమార్

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *