బీడీ కార్మికుల పై జీఎస్టీ దాడి ?

Google+ Pinterest LinkedIn Tumblr +

పెట్టే, బేడా సర్దుకోవాల్సిందేనా…బీడీ కార్మికులు ?
తెలంగాణాకు ప్రధాన ఆదాయ వనరు బీడీ పరిశ్రమ. దీన్ని నమ్ముకుని 7లక్షలకు పైగా కార్మికులు బతుకుతున్నారు.తునికాకు సేకరణే ఎక్కువ శాతం గిరిజనులకు జీవనాధారం. ఉత్తర తెలంగాణాలో అత్యధిక శాతం పేద మహిళలకు అన్నం పెడుతున్న పరిశ్రమ ఇది.

ఇపుడు జీఎస్టీ దెబ్బ ఈ పరిశ్రమ మీద పడింది. బీడీల పై 28శాతం,తునికాకు పై 18 శాతం పన్ను భరించాలి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కంపెనీలలో కొన్ని మూతపడే అవకాశం ఉంది.
జీఎస్టీ పేరుతో మా పొట్టకొట్టకండి దొరా….తునికాకు సేకరణ మీద పన్ను వేస్తే మేమెట్లా బతికాలి?….ఇప్పటికీ మాకు పని తగ్గింది. జీఎస్టీ దెబ్బకు కంపెనీలు మూతపడతాయి. మా పరిస్దితి ఏంది ? బతుకు తెరువు కోసం వలస పోవాల్సిందేనా?” అంటున్నారు సోముల గడ్డకు (వరంగల్‌ జిల్లా), చింతమడక(సిద్దిపేట్‌జిల్లా) చెందిన బీడీ కార్మికులు.
వాస్తవ దృశ్యం ఇలా ఉండగా జీఎస్‌టీతో అంతా లాభమే అంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందరేమో తెలంగాణకు జీఎస్టీ వల్ల నాలుగు వేలకోట్ల నష్టమని చెబుతున్నారు. ఈ లాభనష్టాల వెనుక ఏముందో తెలియని సామాన్యులు నలిగి పోతున్నాడు.

Share.

Leave A Reply