ఎంపీ ల్యాడ్స్‌ మార్గదర్శకాలు -1

mplods-construction

ఎంపీ ల్యాడ్స్‌ మార్గదర్శకాలు 
ప్రజా అవసరాలు, మౌలిక వసతులకోసం ఎంపీ ల్యాడ్స్‌ పథకం కింద గల అవకాశాలు, పార్లమెంటు సభ్యులు అనుసరించాల్సిన విధానాలు
భారత ప్రధాన మంత్రి 1993 డిసెంబర్‌ 23న భారత పార్లమెంటులో ఎంపీల స్థానిక అభివద్ధి నిధుల పథకాన్ని (ఎంపీ ల్యాడ్స్‌) ప్రకటించారు. మొదటగా ఈ పథకం గ్రామీణాభివద్ధి శాఖ అధీనంలోనిది. ఎంపీ లాడ్స్‌ పథకం విధి విధానాలు అమలుకు అనుసరించాల్సిన వైఖరిని గురించి తొలివిడత మార్గదర్శకాలను 1994, ఫిబ్రవరిలో విడుదల చేశారు. 1994 అక్టోబర్‌ లో ఈ కార్యక్రమం అమలును, గణాంకాలు మరియు కార్యక్రమం అమలు శాఖకు అప్పగించారు. 1994 డిసెంబర్‌, 1997 ఫిబ్రవరి, 1999 సెప్టెంబర్‌, 2002 ఏప్రియల్‌, 2005. నవంబర్‌, 2012 ఆగస్టు, చివరిగా 2014, మే నెలలో సవరిస్తూ వచ్చి, సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించారు. 22 ఏళ్ల కాలంలో అనుభవాలను దష్టిలో ఉంచుకుని వివిధ లబ్దిదారులు, పార్లమెంటు సభ్యులు లోక్‌ సభ, రాజ్యసభ కమిటీలు, నాబార్డు కన్సల్టెన్సీ సేవలు (నాబ్‌ కాన్స్‌), భారత కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదికలలో చేసిన సూచనలు, సలహాలను అనుసరించి సమగ్రమైన మార్గదర్శకాలు రూపొందాయి.
పార్లమెంటు సభ్యులు తమ నియోజక వర్గాల్లో అభివద్ధిపనులు చేపట్టడానికి ఈ పథకం వీలు కల్పిస్తుంది. స్థానిక అవసరాలు తీరుస్తు, సామాజిక ఆస్తులు పెంచుతూ ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.
ఈ పథకం ప్రారంభం నుడి తాగు నీటి సదుపాయం, ప్రాథమిక విద్య, ప్రజా ఆరోగ్యం, పారిశుధ్యం, రోడ్లు మొదలైన జాతీయ ప్రధాన్యాలు గల మౌలిక వసతులు కల్పిస్తున్నది.
ఈ పథకం ప్రారంభమైన తొలి సంవత్సరం 1993-94లో ఎంపీ ల్యాడ్స్‌ కింద ఒక్కో పార్లమెంటు సభ్యుడికి ఐదు లక్షల రూపాయలు మాత్రమే కేటాయించారు. 1994-95లో ఒక్కో ఎంపీ నియోజక వర్గం అభివద్ధికి కేటాయించే నిధులు కోటి రూపాయలకు పెంచారు. 1998-99లో ఈ నిధులను రెండు కోట్లకి పెంచారు. 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిధిని ఐదు కోట్లకి పెంచారు. ప్రస్తుతం ఐదుకోట్లుగా ఉన్నది.
గణాంకాలూ మరియు కార్యక్రమం అమలు శాఖ ఈ పథకం కింద అమలయ్యే కార్యక్రమాల అమలులోనూ, పర్యవేక్షణలోనూ, నిధుల విడుదలకూ పాటించాల్సిన విధివిధానాలు రూపొందించింది. జిల్లాల్లో ఎంపీ ల్యాడ్స్‌ పథకం కింద చేపట్టిన కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయానికి ప్రతి రాష్ట్రం, లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఓ నోడల్‌ విభాగాన్ని ఏర్పాటు చేశాయి. ఎంపీ ల్యాడ్స్‌ పథకం కింద కేంద్రం జిల్లాలకు విడుదల చేసిన నిధుల వివరాలను రాష్ట్ర నోడల్‌ విభాగానికి ఎప్పటికప్పుడు తెలియ చేస్తుంది. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అమలవుతున్న కార్యక్రమాలపై నివేదికలను కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నోడల్‌ శాఖకూ నివేదికలు పంపుతారు.
ముఖ్యాంశాలు
ఎంపీ ల్యాడ్స్‌ పూర్తిగా ప్రణాళికా పథకం. ఈ పథకం కింద ఒక్కో ఎంపీకి సంవత్సరానికి కేటాయించే నిధులు ఐదు కోట్ల రూపాయలు.
ఎన్నికయిన లోక్‌సభ సభ్యులు తమ నియోజక వర్గంలో అభివద్ధి పనులకు సిఫారసు చేయవచ్చు. రాజ్యసభ సభ్యులు 2.8, 2.9 పేరాల్లో వివరించిన పనులు మినహా మిగతా అభివద్ధి పనులు తాము ఎన్నికయిన రాష్ట్రంలో ఎక్కడైనా సిఫారసు చేయవచ్చు. లోక్‌ సభ, మరియు రాజ్యసభకు నామినేట్‌ అయిన సభ్యులు మాత్రం దేశంలో ఎక్కడైనా అభివ ద్ధి పనులకు సిఫారసు చేయవచ్చు.
పార్లమెంటు సభ్యులు తాము ఎంచుకున్న జిల్లా నోడల్‌ ఏజెన్సీ వివరాలను మార్గదర్శకాలలోని అనుబంధం-1 ద్వారా గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు ఒకటి, ఒక ప్రతిని రాష్ట్ర ప్రభుత్వానికి, మరియు జిల్లా కలెక్టర్‌ కు సమర్పించాలి. ఒక లోక్‌సభ స్థానం పరిధిలో ఒకటి కంటే ఎక్కువ జిల్లాలు
ఉన్నప్పుడు వాటిలో ఏ ఒక్కటైనా నోడల్‌ ఏజెన్సీగా ఎంచుకోవచ్చు. రాజ్యసభ సభ్యులు తాము ఎన్నికైన రాష్ట్రంలోని ఏదేని జిల్లాను నోడల్‌ జిల్లాగా ఎంచుకోవచ్చును. లోక్‌ సభ, లేదా రాజ్యసభకు నామినేటెడ్‌ సభ్యులు దేశంలో ఏ జిల్లానైనా నోడల్‌ ఏజెన్సీగా ఎంచుకోవచ్చు.
ఎంపీ ల్యాడ్స్‌ పథకం కింద నియోజక వర్గంలో స్థానికంగా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఎక్కువ కాలం ఉండే ఆస్తుల కల్పనకు అనుమతించబడును. అయితే అనుబంధం 2లో నిషేధించిన అంశాలకు అనుమతి లభించదు. అయితే అనుబంధం-2ఎ లో పేర్కొన్న డ్యూరబుల్‌ కాని అంశాలకు సైతం నిధులు మంజూరు అవుతాయి.
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారు ఉండే ప్రాంతాల అభివద్ధి
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారు నివసించే ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరమున్నది. పార్లమెంటు సభ్యులు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్లో విధిగా ఏటా 15 శాతం నిధులను షెడ్యూల్డు కులాల వారుండే ప్రాంతాల అభివద్ధికి వెచ్చించాలి. మరో 7.5 శాతం షెడ్యూల్డు తెగల వారు
ఉండే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విధిగా వెచ్చించాలి. అంటే ఐదు కోట్ల రూపాయల నిధుల్లో 75 లక్షల రూపాయలు ఎస్సీలు ఉండే ప్రాంతాల అభివద్ధి, 37.5 లక్షలు ఎస్టీలుండే ప్రాంతాల అభివద్ధికీ వెచ్చించాలి. ఒక వేళ పార్లమెంటు సభ్యుని నియోజక వర్గం పరిధిలో గిరిజన ప్రాంతాలు లేకపోతే ఎన్నికయిన రాష్ట్రంలో మరెక్కడైనా గిరిజనాభివద్ధి కోసం ఈ నిధులు వెచ్చించడానికి సిఫారసు చేయవచ్చు. ఎస్టీలు రాష్ట్రంలోనే లేనట్లయితే అదే రాష్ట్రంలో ఎస్సీల అభివద్ధికి ఈ నిధులు కేటాయించవచ్చు. అలాగే ఎస్సీలు లేకపోతే ఈ నిధులు ఎస్టీల అభివద్ధికి వాడవచ్చు. ఈ మార్గదర్శకత్వాన్ని అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగానిది. ఎస్సీ, ఎస్టీల అభివద్ధికోసం కేంద్రం, రాష్ట్రం ప్రకటించిన అర్హతలను ద ష్టిలో ఉంచుకుని ఎస్సీ, ఎస్టీలు లబ్దిపొందే విధంగా ఈ మార్గదర్శకత్వాన్ని అమలు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్‌ కు అప్పగించబడింది.
కేవలం గిరిజనాభివద్ధి కోసమే అదనంగా 25 లక్షలు ఖర్చు చేయాలి
గిరిజనుల బాగుకోసం పనిచేసే ట్రస్టులు, సొసైటీలను ప్రోత్సహించడానికి మార్గదర్శకాల పేరా 3.21.2లో చెప్పబడిన రూ. 50 లక్షలున్న పరిమితిని రూ. 75 లక్షలకు పరిమితులకు లోబడి పెంచబడినది.
పరిమితులు (ఎ) కమ్యునిటీ భవనాల పని ముఖ్యముగా గిరిజన ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధి కోసమే. బి) సొసైటీ / ట్రస్టు చేపట్టిన పని మిగిలిన అన్ని ఎంపీల్యాడ్స్‌ మార్గదర్శకాలను లోబడి ఉండాలి. అయితే గిరిజన ప్రాంతంలో భూమి బదలాయింపు వీలుకాదు. అందుచేత కేవలం గిరిజనులకు విద్య, వైద్యం, రహదారుల వంటి సదుపాయాలకోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కార్యక్రమాల నిధుల లాగానే ఎంపిల్యాడ్స్‌ అమలుచేయవచ్చును. అయితే స్కూలు, ఆస్పత్రి, రోడ్డు నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనకు భూమి ఇచ్చిన దాతకు అక్కడ అభివద్ధి పనులు చేపట్టిన తర్వాత దానిపై ఎటువంటి హక్కులూ ఉండవు. సర్వహక్కులూ ప్రభుత్వానికీ, కమ్యూనిటీకీ ఇచ్చినపుడు మాత్రమే ఈ పనులు చేపట్టాలి. పనులు చేపట్టిన అనంతరం ఆస్తిని మొత్తం కమ్యూనిటీలోని అందరూ వాడుకునే వీలుండాలి. అలాగే ఎంపీ ల్యాడ్స్‌ మార్గదర్శకాల్లోని మిగతా నిబంధనలకు కూడా అనుగుణంగా ఉండాలి.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *