శ్రీసిటీలో రూ. 3500 కోట్ల పెట్టుబడులు…?

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీసిటీలో రూ. 3500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రాష్ఠ్ర ప్రభుత్వంతో

14 కంపెనీల ఒప్పందం

  • ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహనా ఒప్పందంపై సంతకాలు
  • 4000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు

శ్రీసిటీ, ఫిబ్రవరి  25, 2018:- విశాఖ లో జరుగుతున్న సి.ఐ.ఐ. భాగస్వామ్య సదస్సులో  రూ. 3500 కోట్ల పెట్టుబడులు శ్రీసిటీలోపెట్టడానికి 14 కంపెనీలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఆదివారం ఒప్పదం చేసుకున్నాయి. ముఖ్యమoత్రి నారా చంద్రబాబు నాయుడు,పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధ రెడ్డి, సత్యవేడు ఎం.ఎల్.ఏ తలారి ఆదిత్య మరియూ శ్రీసిటీ యం.డీ రవీంద్ర సన్నారెడ్డి సమక్షంలోఆయా కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అవగాహనా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, వ్యాపారానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేసిన మనప్రియతమ ముఖ్యమoత్రి పిలుపుమేరకు దేశ విదేశాలనుండి రాష్ఠ్రంలో పెట్టుబడులకై ప్రఖ్యాత వ్యాపార సంస్థలుపోటీబడుతున్నాయని, ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌళిక  వసతులున్న శ్రీసిటీని తమ వ్యాపార గమ్యంగా వివిధ కంపెనీలుఎంపిక చేయటం తమకు గర్వ కారణమని అన్నారు. ఈ నూతన పెట్టుబడుల వలన, మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాని, తద్వారా  ఆ ప్రాంతంలో ఆర్ధికాభివృద్ధి జరగ గలదన్న అశా భావాన్ని ఆయన వ్యక్త పరిచారు.

ఈ 14 కంపెనీలలో – 3 చైనా, 3 అమెరిక, 2 జపాన్, 1 సింగపూర్ దేశాలకు చెందినవి కాగా, మిగిలినవి మన దేశానికి చెందినవే. ఈకంపెనీలన్నీ ఇoజనీరింగ్, సోలార్ ఎనర్జీ,  వినిమయ వస్తువులు, లాజిస్టిక్, ఆహార శుద్ధి వంటి వివిధ ఉత్పత్తుల రంగానికి చెందినవి.వీటిలో 12 కంపెనీలు కొత్తవి కాగా, రెండు సంస్థలు (సిఎక్స్ ప్రిసిషన్ మరియూ జడ్.టి.టి) శ్రీసిటీలో ఉన్న తమ ఉత్పత్తి కేంద్రాలనువిసృతపరచటానికై ఒప్పందం చేసుకున్నాయి. ఈ కంపెనీల వలన సుమారు 4000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు వస్తాయి.

– C. RAVINDRANATH

Share.

Leave A Reply